Viveka Murder Case: ఉదయ్ కుమార్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
ABN , First Publish Date - 2023-09-11T15:34:40+05:30 IST
హైదరాబాద్: వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఈ నెల 13వ తేదీన తీర్పు విలువరించనుంది.
హైదరాబాద్: వైఎస్ వివేక హత్య కేసు (YS Viveka Murder Case)లో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి (Uday Kumar Reddy) బెయిల్ (Bail) పిటిషన్ (Petition)పై సోమవారం సీబీఐ కోర్టు (CBI Court)లో వాదనలు ముగిసాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఈ నెల 13వ తేదీన తీర్పు విలువరించనుంది. వివేక హత్య కేసులో ఏ-6 నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తన భార్య గర్భవతి అని.. ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరని అన్నారు. అందుచేత ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు వైపు వాదనలు పూర్తి కావడంతో సీబీఐ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.