Mulugu Dist.: రాష్ట్రంలో పొత్తులపై బండి సంజయ్ స్పందన..

ABN , First Publish Date - 2023-04-02T16:01:24+05:30 IST

ములుగు జిల్లా: తెలంగాణ (Telangana)లో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు.

Mulugu Dist.: రాష్ట్రంలో పొత్తులపై బండి సంజయ్ స్పందన..

ములుగు జిల్లా: తెలంగాణ (Telangana)లో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఆదివారం ములుగులో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ బన్సల్ (Sunil Bansal), బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీచేస్తాయన్నారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS), ఎంఐఎం (MIM), వామపక్షలు కట్టకట్టుకుని పోటీ చేసినా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పోత్తు పెట్టుకోదని, బీజేపీ సింహంలా సింగిల్‌గానే బరిలో దిగుతుందని, విజయం సాధించి తీరుతామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో గెలిచేది బీజేపీయేనని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్ (CM KCR) అని, రాష్ట్రంలో రైతులకు ఎమీ చేయలేదని బండి సంజయ్ విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర వ్యవహరాల సహ ఇంచార్జ్ సునీల్ బన్సల్ మాట్లాడుతూ ఒక బూత్ నుంచి 16 మంది కార్యకర్తలను తీసుకొని కార్యక్రమాలు చేయాలనుకున్నామని అన్నారు. కార్యకర్తలను గౌరవించుకునే పార్టీ బీజేపీ అని, అందుకే దేశంలో పెద్ద పార్టీగా అవతరించిందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఏ ఉద్దేశంతో చేసుకున్నారో అది నేరవేరిందా? అని ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పడినట్టు అయిందనే భావన ఏర్పడిందన్నారు. బూత్ లెవల్ కార్యకర్తలు ఇలానే పని చేస్తే ములుగులో బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం (BJP Govt.) ఏర్పడడం ఖాయమని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ కోసం బలిదానం చేసిన అమరులకు సముచిత స్థానం ఇస్తామన్నారు. ములుగు లాంటి ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామని సునీల్ బన్సల్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-02T16:01:24+05:30 IST