Paper Leakage.. పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బండి సంజయ్ కుట్ర: పోలీసులు
ABN , First Publish Date - 2023-04-05T14:59:20+05:30 IST
హైదరాబాద్: పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కుట్ర చేస్తున్నారని.. అందుకే ముందస్తు చర్యగా ఆయనను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు.
హైదరాబాద్: పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కుట్ర చేస్తున్నారని.. అందుకే ముందస్తు చర్యగా ఆయనను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. వికారాబాద్ (Vikarabad), కమలపూర్ (Kamalapur)లో పేపర్ లీకేజ్ (Paper Leakage)లపై బండి సంజయ్ ప్రెస్ నోట్ (Press Note) ఇచ్చారని, పేపర్ లీకేజ్‌లకు ప్రభుత్వమే భాద్యతంటూ.. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR)లో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని, పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగేలా ఆందోళనలు చేయాలని బీజేపీ శ్రేణులకు ఉద్దేశపూర్వకంగా పిలుపునిచ్చారని పోలీసులు పేర్కొన్నారు. బండి సంజయ్ చర్యల వల్ల పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అందుకే ముందస్తుగా అరెస్టు చేశామన్నారు. అనేక మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలోపెట్టుకుని, పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్‌ని ప్రివెన్షన్ కింద అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.
మాస్ కాపీయింగ్ (Mass Copying) వ్యవహారంలో బండి సంజయ్ పాత్రకు సంబంధించి ఎక్కడా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో మెన్షన్ చేయలేదు. కేవలం రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతున్నారని... అందుకే అరెస్టు చేసి.. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా ఇప్పటికే బీజేపీ లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో హెబియస్ కార్పస్ పిటిషన్ (Habeas Corpus Petition) వేసింది. దీనిపై ఇంకా న్యాయస్థానం నిర్ణయం తీసుకోలేదు. కాగా బండి సంజయ్, ప్రశాంత్ల చాంటింగ్లపై పోలీసులు దృష్టి సారించారు. పేపర్ లీక్ కంటే ముందురోజు ప్రశాంత్‌తో బండి సంజయ్ చాటింగ్ చేశారని, సంజయ్‌తో ప్రశాంత్ 100కు పైగా కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న సంజయ్‌కు పేపర్ పంపాక కూడా ప్రశాంత్ కాల్ మాట్లాడినట్లు గుర్తించారు. ప్రశాంత్ వాట్సాప్ చాట్‌ను అధికారులు రిట్రివ్ చేస్తున్నారు.