BJP: మోదీ సభకు డుమ్మా కొట్టిన బీజేపీ కీలక నేతలు
ABN , First Publish Date - 2023-10-03T19:14:14+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు మోదీ పర్యటనలో ఎక్కడ కనిపించడం లేదు. మోదీ నిజామాబాద్ సభకు మాజీ ఎంపీ విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి దూరంగా ఉన్నారు. మెన్న జరిగిన పాలమూరు సభకు సైతం బీజేపీ ముఖ్యనేతలు దూరంగా ఉన్నారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు మోదీ పర్యటనలో ఎక్కడ కనిపించడం లేదు. మోదీ నిజామాబాద్ సభకు మాజీ ఎంపీ విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి దూరంగా ఉన్నారు. మెన్న జరిగిన పాలమూరు సభకు సైతం బీజేపీ ముఖ్యనేతలు దూరంగా ఉన్నారు. కొంతకాలంగా సొంత పార్టీ తీరుపై విజయశాంతి, రాజగోపాలరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ప్రధాని తెలంగాణకు వస్తే.. ఈ సమయంలో మాజీ ఎంపీ వివేక్ ఢిల్లీలో ఉన్నారు. కీలక నేతలే ప్రధాని మోదీ సభకు డుమ్మా కొట్టడంపై బీజేపీలో చర్చ జరుగుతోంది. కాగా సోషల్ మీడియాలో ఈ నేతలు త్వరలో కాంగ్రెస్ చేరబోతున్నట్లు విసృత ప్రచారం జరుగుతోంది.