Bhatti vikramarka: అసెంబ్లీలో ఏం చేయాలో కాంగ్రెస్‌కు తెలుసు
ABN , First Publish Date - 2023-08-03T17:43:57+05:30 IST
సభ ఎక్కువ రోజులు నడపాలని స్పీకర్‌కు లేఖ రాస్తాం. పోడు భూములు, ధరణి, సింగరేణి, బీసీ సబ్ ప్లాన్‌పై శాసనసభలో చర్చించాలి. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై చర్చకు డిమాండ్ చేస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో సభ నిర్వహించాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్‌పై కూడా చర్చ జరగాలి.
హైదరాబాద్: దేశంలో అతి తక్కువ రోజులు అసెంబ్లీ నడిపిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti vikramarka) వ్యాఖ్యానించారు. భట్టి విక్రమర్క మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘‘సభ ఎక్కువ రోజులు నడపాలని స్పీకర్‌కు లేఖ రాస్తాం. పోడు భూములు, ధరణి, సింగరేణి, బీసీ సబ్ ప్లాన్‌పై శాసనసభలో చర్చించాలి. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై చర్చకు డిమాండ్ చేస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో సభ నిర్వహించాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్‌పై కూడా చర్చ జరగాలి. రుణమాఫీ వడ్డీతో సహా చెల్లించాలి. ఏ సమస్యను సభలో లేవనెత్తాలో మాకు తెలుసు. ప్రభుత్వ భూముల అమ్మకాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూములు అమ్ముతున్నారనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం అమ్మిన భూములను గుంజుకుంటామన్న కేసీఆరే ఇప్పుడు విచ్చలవిడిగా భూములు అమ్ముతున్నారు.’’ అని భట్టి ఆరోపించారు.