CM KCR: ముస్లింలకు 'మిలాద్ ఉన్ నబీ' శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2023-09-27T19:33:04+05:30 IST

'మిలాద్ ఉన్ నబీ'( 'Milad Un Nabi') పండుగ (సెప్టెంబర్ 28)ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(CM KCR) ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

CM KCR: ముస్లింలకు 'మిలాద్ ఉన్ నబీ' శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: 'మిలాద్ ఉన్ నబీ'( 'Milad Un Nabi') పండుగ (సెప్టెంబర్ 28)ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(CM KCR) ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘అల్లా ప్రపంచ శాంతి స్థాపన కోసం మహమ్మద్‌ను చివరి ప్రవక్తగా నియమించాడని ముస్లింలు భావిస్తారని, మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన శాంతి, కరుణ, ధార్మిక చింతన, దాతృత్వం, ఐకమత్యం, సర్వ మానవ సమానత్వం ప్రపంచమంతా వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ముస్లిం మైనార్టీ ప్రజల సామాజిక ఆర్థిక ఆధ్యాత్మిక అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. తెలంగాణలో ‘‘గంగా జమున తహజీబ్’’ పరిరక్షణకు తమ కృషి కొనసాగుతూనే ఉంటుంది’’ అని సీఎం కేసీఆర్ లేఖలో తెలిపారు.

Updated Date - 2023-09-27T19:33:04+05:30 IST