Revanth Reddy: ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి
ABN , First Publish Date - 2023-02-15T13:56:41+05:30 IST
జనగామ: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komati Reddy Venkat Reddy) నిన్న చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు.
జనగామ: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komati Reddy Venkat Reddy) నిన్న చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ మాట్లాడినా ఉపేశిక్షబోమని అన్నారు. అలా మాట్లాడిన వారిపై అధిష్టానం అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ (BRS)తో పొత్తు ఉండదని వరంగల్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఎంతపెద్ద నాయకుడు మాట్లాడినా పార్టీ ఉపేక్షించదన్నారు. పార్టీకి నష్టం కలిగేలా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చామన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దౌర్జన్యాలపై ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా నిన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు (Sensational comments) చేశారు. ఈసారి తెలంగాణ (Telangana)లో హంగ్ అసెంబ్లీ (Hung Assembly) వస్తుందని జోస్యం చెప్పారు. తమతో కలవాల్సిందే కాబట్టి సీఎం కేసీఆర్ (CM KCR) కాంగ్రెస్‌ను పొగుడుతూ.. బీజేపీ (BJP)ని తిడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదని, మరో పార్టీతో కలవాల్సిందేనని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో మేము చెప్పామని, దేశానికి చాలా చేసిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మంచి పార్టీ అని, తెలంగాణ ఇచ్చిందని.. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలని, తాము బీజేపీతో కలిసేదిలేదని స్పష్టం చేశారు. సీనియర్ నేతలు (Senior Leaders) అందరూ కలిస్తే కాంగ్రెస్‌కు 40 నుంచి 50 సీట్లు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మార్చి మొదటి వారంలో యాత్ర ప్రారంభిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. తాను స్టార్ క్యాంపైనర్‌నని రాష్ట్రమంతా తిరుగుతానని చెప్పారు. యాదగిరి గుట్ట (Yadagiri Gutta) నుంచి యాత్ర మొదలు పెడతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ మానిక్ థాక్రే (Manik Thackeray) వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి బాగుందని, పార్టీ గాడిలో పడిందన్నారు. గత ఇంఛార్జ్ అంతా ఫోన్‌లోనే చూసుకునేవారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.