Hyderabad: అక్బరుద్దీన్‌తో కాంగ్రెస్ నేతల భేటీ...
ABN , First Publish Date - 2023-02-06T16:01:38+05:30 IST
హైదరాబాద్: ఎంఐఎం (MIM) నేత అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi)తో కాంగ్రెస్ నేతలు (Congress Leaders) భేటీ అయ్యారు.
హైదరాబాద్: ఎంఐఎం (MIM) నేత అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi)తో కాంగ్రెస్ నేతలు (Congress Leaders) భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 50 నియోజకవర్గాలలో నిజంగా పోటీ చేస్తారా? అని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు (Shridhar Babu) అడిగారు. ఖచ్చితంగా పోటీ చేస్తామని అక్బరుద్దీన్ చెప్పారు. బీజేపీ బీ టీమ్ (BJP B Team) అని ప్రచారం చేస్తున్నారని, కానీ మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. దేశం, రాష్ట్రంలో బీజేపీ చేసే అరాచకాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. బీజేపీ పూర్తిగా ఓటు బ్యాంకు పొలరైజ్ చేస్తోందని, మేము తమ వర్గానికి అండగా ఉంటామని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ఇలా అయితే ఎంఐఎం చేస్తున్నదేంటని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మీరు మీ వర్గానికి అంటే.. బీజేపీ ఎజెండా కూడా అదే కదా అని ప్రశ్నించారు. ఎవరు ఏమనుకున్నా.. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం మాత్రం విస్తరిస్తుందని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.