T Congress Manifesto: స్టూడెంట్స్‌కి అదిరిపోయే పథకం! ప్రతి ఒక్కరికీ ఉచితంగా..!

ABN , First Publish Date - 2023-09-30T03:50:35+05:30 IST

కాంగ్రెస్‌ విజయభేరి సభలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోపాటుగా రైతు, యువత, దళిత డిక్లరేషన్లలోనూ ఆకర్షణీయమైన హామీలను ప్రకటించిన టీపీసీసీ.. రాష్ట్రంలోని

T Congress Manifesto: స్టూడెంట్స్‌కి అదిరిపోయే పథకం! ప్రతి ఒక్కరికీ ఉచితంగా..!

  • ఆటో డ్రైవర్లకూ ప్రత్యేక పథకం!

  • టీపీసీసీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో నిర్ణయం

కాంగ్రెస్‌ విజయభేరి సభలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోపాటుగా రైతు, యువత, దళిత డిక్లరేషన్లలోనూ ఆకర్షణీయమైన హామీలను ప్రకటించిన టీపీసీసీ.. రాష్ట్రంలోని విద్యార్థులను ఆకట్టుకునేలా మరో హామీని తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమైన టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఆటో డ్రైవర్ల సంఘాలతో సమావేశమై దీనికి సంబంధించి ఫీడ్‌ బ్యాక్‌ను కమిటీ తీసుకోనుంది. కమిటీ చైర్మన్‌ శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్‌, ప్రసాద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఇప్పటి వరకు వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, ప్రతిపాదనలను సమీక్షించారు. అక్టోబరు 2 నుంచి జిల్లాల పర్యటన నిర్వహించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. 2న ఉదయం ఆదిలాబాద్‌, సాయంత్రం నిజామాబాద్‌ జిల్లాల్లో కమిటీ పర్యటించనుంది. కాగా.. సీఆర్‌పీఎఫ్‌ రిటైర్డ్‌ జవాన్లు శుక్రవారంటీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీని కలిసి వారి సమస్యలు, పరిష్కారానికి మ్యానిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలను కమిటీకి సమర్పించారు.

Updated Date - 2023-09-30T11:53:35+05:30 IST