Jeevan Reddy: తెలంగాణ సర్కార్‌కు కనిపించే ఆదాయ మార్గాలు రెండే..

ABN , First Publish Date - 2023-08-05T10:26:07+05:30 IST

తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు రెండే ఉన్నట్లు కనిపిస్తున్నాయని.. అవి ఒకటి ప్రభుత్వ భూములు అమ్మకం.. రెండు మద్యం వ్యాపారం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Jeevan Reddy: తెలంగాణ సర్కార్‌కు కనిపించే ఆదాయ మార్గాలు రెండే..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) ఆదాయ మార్గాలు రెండే ఉన్నట్లు కనిపిస్తున్నాయని.. అవి ఒకటి ప్రభుత్వ భూములు అమ్మకం.. రెండు మద్యం వ్యాపారం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Congress MLC Jeevan Reddy) వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 44 శాతం అని చెబుతున్నారు.. కానీ తెలంగాణ ఉద్యోగుల వాటా ఎంత అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత పాలకులు మారారు తప్ప... ప్రజల జీవన స్థితగతుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానికులకు అవకాశాలు కల్పిస్తున్నారని... తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2023-08-05T10:26:07+05:30 IST