TS NEWS: తెలంగాణలో మళ్లీ కొవిడ్ కేసులు... 5 కేసుల నమోదు
ABN , Publish Date - Dec 19 , 2023 | 10:45 PM
కరోనా ( Carona ) మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈసారి JN-1 పేరుతో కొవిడ్ వ్యాప్తి చెందుతోంది. ఈ కరోనా కొత్త వేరియంట్‌తో భారతదేశంలోని పలు రాష్ట్రాలల్లో కేసు నమోదవుతున్నాయి. అయితే కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.
హైదరాబాద్: కరోనా ( Carona ) మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈసారి JN-1 పేరుతో కొవిడ్ వ్యాప్తి చెందుతోంది. ఈ కరోనా కొత్త వేరియంట్‌తో భారతదేశంలోని పలు రాష్ట్రాలల్లో కేసు నమోదవుతున్నాయి. అయితే కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. JN-1 లక్షణాలతో ఉన్న ఐదుగురు రోగులను వైద్యాధికారులు గుర్తించినట్లు తెలిసింది. వీరికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే ఏ జిల్లాల్లో కొత్త వేరియంట్ రోగులను గుర్తించారన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు.