CPI Narayana: వస్తే రండి.. లేకపోతే లేదని బీజేపీకి పవన్ తేల్చి చెప్పేశారు
ABN , First Publish Date - 2023-09-14T16:21:42+05:30 IST
టీడీపీ - జనసేన పొత్తుపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. తమతో వస్తే రండి.. లేకుంటే లేదని పవన్ కళ్యాణ్ బీజేపీకి తేల్చి చెప్పారని అన్నారు. టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయని పవన్ తేల్చి చెప్పారన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయించింది కేంద్రంలోని బీజేపీనే అని ఆరోపించారు. బీజేపీ అండదండలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయటం జగన్‌కు సాధ్యం కాదన్నారు.
హైదరాబాద్: టీడీపీ - జనసేన పొత్తుపై సీపీఐ నేత నారాయణ (CPI Leader Narayana) స్పందించారు. తమతో వస్తే రండి.. లేకుంటే లేదని పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalayan) బీజేపీకి తేల్చి చెప్పారని అన్నారు. టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయని పవన్ తేల్చి చెప్పారన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయించింది కేంద్రంలోని బీజేపీనే అని ఆరోపించారు. బీజేపీ అండదండలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయటం జగన్‌కు (CM Jagan) సాధ్యం కాదన్నారు. ఎంఐఎంకు అన్ని పార్టీలు భయపడినట్టు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా భయపడుతోందన్నారు. అందుకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, పోరాటంలో పాల్గొన్న పోరాట యోధులను గుర్తించడం లేదని విమర్శించారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సాయుధ పోరాటాన్ని అధికారికంగా చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. గురువారం వైఎమ్‌సీఏ సిగ్నల్ దగ్గర షోయబుల్లాఖాన్ చిత్ర పటానికి నివాళులర్పించిన సీపీఐ నేత.. తెలంగాణ ప్రెస్ అకాడమీకి షోయబుల్లాఖాన్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.