Share News

CPI Narayana : రజాకార్ సినిమా పేరుతో బీజేపీ నేతలు చరిత్రను వక్రదారి పట్టిస్తున్నారు

ABN , First Publish Date - 2023-10-20T18:35:01+05:30 IST

రజాకార్ సినిమా ( Razakar movie ) పై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, సెన్సార్ బోర్డుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) ఫిర్యాదు చేశారు.

CPI Narayana : రజాకార్ సినిమా పేరుతో బీజేపీ నేతలు చరిత్రను వక్రదారి పట్టిస్తున్నారు

ఢిల్లీ : రజాకార్ సినిమా ( Razakar movie ) పై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, సెన్సార్ బోర్డుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) ఫిర్యాదు చేశారు. శుక్రవారం నాడు ఢిల్లీ వేదికగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రజాకార్ సినిమా పేరుతో బీజేపీ నేతలు చరిత్రను వక్రదారి పట్టిస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి రజాకార్ సినిమాకు ఫైనాన్స్ చేశారు. రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణలో సాయుధ పోరాటం జరిగింది. బీజేపీ సాయుధ పోరాటాన్ని విముక్తి పోరాటంగా చూస్తుంది. బీజేపి నేతలు ఇలాంటి ప్రయత్నాల వల్ల చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. రజాకార్ సినిమాని విడుదల కాకుండా నిలిపివేయాలి. రజాకార్ సినిమా విడుదలవుతే మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లు అవుతుంది’’ అని నారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-20T18:35:01+05:30 IST