CS Shanti Kumari : వర్షాలు పడుతున్నాయి.. అధికారులు అలర్ట్ కావాలి.. సీఎస్ ఆదేశం

ABN , First Publish Date - 2023-09-05T22:23:27+05:30 IST

రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారమైన భారీ వర్షాలు(Heavy Rains) పడతాయని వాతావరణ శాఖ(Department of Meteorology) తెలిపినందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి (CS Shanti Kumari) ఆదేశించారు.

 CS Shanti Kumari : వర్షాలు పడుతున్నాయి.. అధికారులు అలర్ట్ కావాలి.. సీఎస్ ఆదేశం

హైదరాబాద్: రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారమైన భారీ వర్షాలు(Heavy Rains) పడతాయని వాతావరణ శాఖ(Department of Meteorology) తెలిపినందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి (CS Shanti Kumari) ఆదేశించారు. మంగళవారం నాడు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్(Teleconference) నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లతో సీఎస్ మాట్లాడుతూ..వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పలు జిల్లాల్లో చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని, ఆయా చెరువులకు గండ్లు పడడం, తెగిపోకుండా ఉండేందుకు తగు రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉదృతంగా ప్రవహించే కాజ్-వేలు, కల్వర్టులు, వంతెనల వద్ద ముందు జాగ్రత్త చర్యగా తగు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదలతో జరిగే నష్టాన్ని నివారించేందుకు గానూ సంబంధిత మండల స్థాయి రెవెన్యూ, పీఆర్ తదితర అధికారులతో రెగ్యులర్ టెలి-కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షించాలన్నారు.

ప్రతీ జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌లను(Control room) ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. వర్షాలు, వరద ప్రాభావిత ప్రాంతాల్లో స్థానిక అగ్నిమాపక, పోలీసు బృందాలను మోహరించాలని చెప్పారు.వర్ష, వరద ప్రాభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాతాలకు తరలించాలని అన్నారు. అలాగే వరద బాధిత కుటుంబాలకు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి, బాధితులకు ఆహారం, మంచినీరు, వైద్య తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని సీఎస్ ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌(Greater Hyderabad)లో లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లను చేయడంతోపాటు, మ్యాన్-హోళ్లపై మూతలు తెరువకుండా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.

Updated Date - 2023-09-05T22:24:21+05:30 IST