TS NEWS: నార్సింగిలో డెకాయిట్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2023-10-09T19:29:29+05:30 IST

నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో డెకాయిట్‌ గ్యాంగ్‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పుప్పాల్‌గూడలో వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ జరిగింది. ఆమె మెడలో ఉన్న 4 తులాల గొలుసును చోరీ చేసిన దొంగను నార్సింగి పోలీసులు పట్టుకున్నారు.

TS NEWS: నార్సింగిలో డెకాయిట్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌: నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో డెకాయిట్‌ గ్యాంగ్‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పుప్పాల్‌గూడలో వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ జరిగింది. ఆమె మెడలో ఉన్న 4 తులాల గొలుసును చోరీ చేసిన దొంగను నార్సింగి పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన దొంగను పోలీసులు విచారించారు. ఈ విచారణలో ముఠా వివరాలను సేకరించారు. పలు పోలీస్‌స్టేషన్లలో ముఠా సభ్యులపై కేసులు నమోదు అయ్యాయి. గ్యాంగ్ నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ గ్యాంగుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2023-10-09T19:29:33+05:30 IST