Share News

Bhatti Vikramarka: ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భట్టి.. తొలి సంతకం దేనిపైనంటే?

ABN , Publish Date - Dec 14 , 2023 | 09:34 AM

Telangana: ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వీకరించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆర్థక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టి.. మొదటగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు.

Bhatti Vikramarka: ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భట్టి.. తొలి సంతకం దేనిపైనంటే?

హైదరాబాద్: ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) స్వీకరించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆర్థక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టి.. మొదటగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రూ.298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు. ఆపై ద్యుత్ సబ్సిడీ 996 కోట్ల రూపాయలు విడుదల ఫైలుపై సంతకం చేశారు. అలాగే సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కొరకు రూ.75 కోట్ల రూపాయలు వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతకం చేశారు.

Updated Date - Dec 14 , 2023 | 09:37 AM