CEC: తెలంగాణ ఎన్నికలపై ఈసీ ప్రత్యేక ఫోకస్..
ABN , First Publish Date - 2023-10-20T16:17:59+05:30 IST
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టింది. ఎప్పటికప్పుడు ఎన్నికలపై ఆరా తీస్తోంది. ఇప్పటికే తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతుండడంతో సీఈసీ అప్రమత్తమైంది. 20వేల కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాలని నిర్ణయించుకుంది.
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో తెలంగాణ (Telangana)పై కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ప్రత్యేక నిఘా పెట్టింది. ఎప్పటికప్పుడు ఎన్నికలపై ఆరా తీస్తోంది. ఇప్పటికే తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతుండడంతో సీఈసీ (CEC) అప్రమత్తమైంది. 20వేల కేంద్ర బలగాలను (20 thousand central forces) రాష్ట్రానికి పంపాలని నిర్ణయించుకుంది. మరో రెండు రోజుల్లో సీఐఎస్ఎఫ్ (CISF), సీఆర్పీఎఫ్ (CRPF) వంటి బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. ఎమ్మార్వో స్థాయి అధికారి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు క్షేత్ర స్థాయిలో సీఈసీ దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిపిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. దీంతో మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఈసీ భావించింది. అందులో భాగంగా మరో రెండు రోజుల్లో కేంద్ర బలగాలు తెలంగాణకు రానున్నాయి. రాబోయే రోజుల్లో డబ్బు, మద్యం భారీగా పంపిణీ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో కేంద్ర నిధుల కమిషన్‌కు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నారు.