Enforcement Directorate: డెక్కన్‌ క్రానికల్‌ ప్రమోటర్లను అరెస్ట్ చేసిన ఈడీ.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2023-06-14T10:44:56+05:30 IST

హైదరాబాద్‌: డెక్కన్‌ క్రానికల్‌ ప్రమోటర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. టి.వెంకట్రామి ‌రెడ్డి, పీకే అయ్యర్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. డీసీ ఆడిటర్‌ మనీ ఊమెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కెనరా, ఐడీబీఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో అరెస్ట్‌ చేయడం గమనార్హం.

Enforcement Directorate: డెక్కన్‌ క్రానికల్‌ ప్రమోటర్లను అరెస్ట్ చేసిన ఈడీ.. కారణం ఇదే..

హైదరాబాద్‌: డెక్కన్‌ క్రానికల్‌ ప్రమోటర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. టి.వెంకట్రామి ‌రెడ్డి, పీకే అయ్యర్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. డీసీ ఆడిటర్‌ మనీ ఊమెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కెనరా, ఐడీబీఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో అరెస్ట్‌ చేయడం గమనార్హం. రూ.8 వేల కోట్ల బ్యాంక్‌ ఫ్రాడ్‌ కేసులో అరెస్ట్ అయిన వారంతా అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సీబీఐ కేసుల ఆధారంగా మనీలాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు జరిపింది. హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరులోని డెక్కన్‌ క్రానికల్‌కు చెందిన 14 ఆస్తులు అటాచ్‌ చేసింది. డెక్కన్‌ క్రానికల్‌ బ్యాంక్‌ ఫ్రాడ్‌ కేసులో ఆరు FIRలు నమోదు చేసింది. గతంలో రూ.386 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

Updated Date - 2023-06-14T10:44:56+05:30 IST