Share News

Etala: హంగ్ వస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి...

ABN , First Publish Date - 2023-11-06T12:58:57+05:30 IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నీళ్ళు, నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ సంపూర్ణంగా విఫలమయ్యారన్నారు.

Etala: హంగ్ వస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి...

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajendar) ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నీళ్ళు, నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ సంపూర్ణంగా విఫలమయ్యారని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మాదిరిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల 5,800 ఎకరాల భూమిని అభివృద్ధి పేరిట అతి చౌక ధరలకు కేసీఆర్ కుటుంబం తీసుకుందని ఆరోపించారు. ఒక్క గజ్వేల్‌ (Ghazwel)లోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులున్నారని, ఆయన అడుగులకు మడుగులు వత్తే వారికే బీసీ బంధు ఇచ్చారని విమర్శించారు.

ఒకవేళ తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) హంగ్ (Hung) వస్తే.. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఈటల రాజేందర్ అన్నారు. గతంలో కలసి పనిచేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైతే తాను గజ్వేల్‌లో ఎందుకు పోటీ చేస్తానని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ గతంలో ‌ఎప్పుడూ కలసి పోటీ చేయలేదని, బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్‌ను నిలువరించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-11-06T12:58:59+05:30 IST