Etela Rajender: బీజేపీలో మిస్టరీగా మారిన ఈటల మౌనం..
ABN , First Publish Date - 2023-06-20T14:16:02+05:30 IST
హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మౌనం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యాలయానికి కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) మౌనం (Silence) హాట్ టాపిక్ (Hot Topic)గా మారింది. ఆయన కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యాలయానికి కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం కుత్బుల్లాపూర్‌లో జరిగిన సంపర్క్ అభియాన్ (Sampark Campaign)లో భాగంగా జరిగిన బహిరంగసభకు కూడా ఈటల దూరంగానే ఉన్నారు.
గత 10 రోజుల క్రితం ఈటల రాజేందర్ అసోం సీఎం (Assam CM) హిమంత బిశ్వశర్మ (Himanta Biswasharma)ను కలిసి వచ్చారు. అప్పటి నుంచి ఆయన మౌనంగా ఉంటున్నారు. ఇదే క్రమంలో ఈటలకు బీజేపీ (BJP) ఎన్నికల ప్రచారకమిటీ ఛైర్మన్ పదవిపై మీడియాలో లీకులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈటలకు వ్యతిరేకంగా పలువురు సీనియర్లు సమావేశమై చర్చించడం కీలకంగా మారింది. అప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటూ ఈటల మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్‌కు బీజేపీ బీ టీమ్ అంటూ కాంగ్రెస్ (Congress) చేసిన ఆరోపణలపై కూడా ఈటల మౌనంగానే ఉన్నారు. మరోవైపు ఈటలతోపాటు మరోనేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మౌనంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈటల మౌనం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనేది అటు పార్టీలో.. ఇటు అభిమానుల్లోనూ జోరుగా చర్చసాగుతోంది. ఇందుకుగల కారణాలపై ఆరా తీస్తున్నారు.