BRS : కారులో కొట్లాట!

ABN , First Publish Date - 2023-07-29T03:14:57+05:30 IST

తాండూరులో ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి మధ్య విభేదాలు. ఈసారి టికెట్‌ దక్కకపోతే కాంగ్రె్‌సలో చేరే యోచనలో ఉన్న మహేందర్‌రెడ్డి. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ పట్ల సీనియర్‌ నేతలు చందర్‌రావు, కె.శశిధర్‌ రెడ్డి తదితరుల అసంతృప్తి. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో

BRS : కారులో కొట్లాట!

  • బీఆర్‌ఎస్‌లో తీవ్రరూపం దాలుస్తున్న అసమ్మతులు..

  • నియోజకవర్గాల్లో బహిర్గతమవుతున్న విభేదాలు

  • ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నేతల సమావేశాలు..

  • సిటింగులకు టికెట్లివ్వద్దంటూ అధిష్ఠానానికి ఫిర్యాదులు

  • సొంత పార్టీ నేతల మధ్య పెరుగుతున్న దూరం..

  • అధిష్ఠానం అలసత్వమే కారణమంటున్న శ్రేణులు

హైదరాబాద్‌/న్యూస్‌ నెట్‌వర్క్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): తాండూరులో ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి(MLA Pilot Rohit Reddy)కి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి(Patnam Mahender Reddy)కి మధ్య విభేదాలు. ఈసారి టికెట్‌ దక్కకపోతే కాంగ్రె్‌సలో చేరే యోచనలో ఉన్న మహేందర్‌రెడ్డి. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌(Bollam Mallaiyadav) పట్ల సీనియర్‌ నేతలు చందర్‌రావు, కె.శశిధర్‌ రెడ్డి తదితరుల అసంతృప్తి. స్టేషన్‌ ఘన్‌పూర్‌(Station Ghanpur)లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(Kadiam Srihari) మధ్య ఇప్పటికే రచ్చకెక్కిన విభేదాలు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌(MLA Aruri Ramesh)కు ఈసారి టికెట్‌ ఇవ్వవద్దంటున్న అసంతృప్త నేతలు. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy)తో పొసగక కాంగ్రెస్(Congress) లో చేరే ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు మళ్లీ టికెట్‌ ఇస్తే కాంగ్రెస్ లో చేరతానంటున్న జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి. ..ఇలా చెప్పుకొంటూ పోతే రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ.. గ్రూపు తగాదాలు, అసంతృప్తులను ఎదుర్కొంటోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇవి మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి.

ఎమ్మెల్యేల తీరుపట్ల సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. కొందరు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యేను ఓడించాలని చర్చించుకుంటున్నారు. కొన్ని చోట్ల సిటింగులు అవినీతికి పాల్పడ్డారని.. ఈ సారి టికెట్‌ ఇవ్వొద్దంటూ పార్టీ అధిష్ఠానానికి సూచిస్తున్నారు. మరికొందరు ఈసారి టికెట్‌ తమకేనంటూ ప్రచారం చేసుకుంటూ ఎమ్మెల్యేలకు ఇబ్బందికర పరిస్థితుల్ని సృష్టిస్తున్నారు. ఇంకొందరు సోషల్‌ మీడియా వేదికగా పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ.. తమ వ్యక్తిగత పరువుతోపాటు.. పార్టీ పరువును కూడా బజారుకీడుస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం గతంలో మాదిరిగా వీటిని తీవ్రంగా పరిగణించకుండా అలసత్వం ప్రదర్శిస్తోందని, దీంతో ఇవి రోజురోజుకూ పెరిగిపోతున్నాయని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయకపోతే వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నాయి.

అరూరిని వేధిస్తున్న అసంతృప్తులు..

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరూ రి రమే్‌షను అసంతృప్తుల బెడ ద వేధిస్తోంది. ఇటీవల అక్కడ నిర్వహించిన పార్టీ సమావేశంలో పలువురు నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు తదితరులు అరూరికి టికెట్‌ ఇవ్వొద్దంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, నర్సంపేట సిటింగ్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డిపై అక్కడి ఉద్యమకారులు తిరుగుబావుటా ఎగురవేశారు. 10 మంది నేతలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రహస్య సమావేశం ఏర్పాటు చేసుకోగా సుదర్శన్‌రెడ్డి వారిని బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో సిటింగ్‌ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు ఆదినుంచి అసంతృప్తుల సెగ వెంటాడుతూనే ఉంది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్‌ గుండు సుధారాణి తదితరులతో సంబంధా లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక నిర్మల్‌ జిల్లా ముధోల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో తిరుగుబాటు మొదలైంది పలువురు మండల స్థాయి నేతలు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశారు.


బొల్లం మల్లయ్యకు టికెట్‌ ఇవ్వొద్దని..

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ద్వితీయశ్రేణి నాయకులను ఎదగనివ్వడం లేదంటూ స్థానికులు అసంతృప్తితో ఉన్నారు. ఇక పలు ఆరోపణలు, వివాదాలు ఎదుర్కొంటున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆర్‌. ప్రవీణ్‌కుమార్‌ పావులు కదుపుతున్నారు. సూర్యాపేట జిల్లా.. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ పట్ల మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, సీనియర్‌ నేతలు కె.శశిధర్‌ రెడ్డి, యెర్నేని బాబుతో పాటు పలువురు సీనియర్‌ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేపై స్థానిక ము నిసిపల్‌ చైర్‌ పర్సన్‌, ఎంపీపీతోపాటు పలువురు సీనియర్‌ నాయకులు పలు వేదికలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబిత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి మధ్య కొంతకాలం గా విభేదాలు కొనసాగుతున్నా యి. తనకు ఈసారి టికెట్‌ ఇవ్వ కుంటే.. పార్టీ వీడతానని తీగల అంటున్నారు.

సాగర్‌లో ఎమ్మెల్యే వర్సెస్‌ ఎమ్మెల్సీ..

నాగార్జున్‌సాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌కు, ఎమ్మెల్సీ కోటిరెడ్డికి మధ్య వర్గవిభేదాలు తీవ్రమవుతున్నాయి. ఎమ్మెల్యే భగత్‌ వాల్‌ పోస్టర్లను ఇటీవల కొంతమంది చింపేయడం వివాదాస్పదంగా మారింది. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డితో పాటు, పార్టీ నేత పిల్లి రామరాజు యాదవ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమం లో కిషన్‌ రెడ్డి ప్రకటించుకున్నారు. నకిరేకల్‌ నియోజక వర్గంలో చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంల మధ్య విభేదాలు తీవ్రంగా మా రాయి. ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే వీరేశం కాంగ్రె్‌సలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్‌ జిల్లా.. బోధన్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే షకీల్‌కు, మునిసిపల్‌ చైర్మన్‌ భర్త శరత్‌రెడ్డికి మధ్య సఖ్యత లేదు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కింది స్థాయి నేతలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఆయనకు టికెట్‌ ఇ వ్వొద్దంటూ.. అక్కడి మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టి అధిష్టానాన్ని కోరారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అవినీతికి పాల్పడుతున్నారని, ఈ సారి ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దని డిమాండ్‌ చేస్తూ సొంత పార్టీ నేతలే యాత్ర చేపట్టారు.

కొత్తగూడెంలో ఎవరికి వారే..

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో బీ ఆర్‌ఎస్‌ పార్టీ.. వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావు, తుమ్మల నాగేశ్వరరావు, గడల శ్రీనివాసరావు వర్గాలుగా చీలిపోయింది. పొంగులేటి కాంగ్రె స్‌లో చేరాక.. ముఖ్య నేతలంతా.. ఆ పార్టీలోకి వెళ్లడం తో బీఆర్‌ఎస్‌ ద్వితీయశ్రేణి నాయకుల్లో అయోమ యం ఏర్పడింది. కాగా, వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతు కు ఆనంద్‌కు, అక్కడి సీనియర్‌ నాయకుల మధ్య వర్గ విభేదాలు ముదిరాయి. తాండూరులో ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి మధ్య వర్గ విబేధాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. మహేందర్‌ రెడ్డికి టికెట్‌ దక్కకపోతే తన వర్గంతోపాటు కాంగ్రె్‌సలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ టికెట్‌ ఆశిస్తున్న వర్కటం జగన్నాథ్‌ రెడ్డి, రాష్ట్ర ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవర మల్లప్ప వర్గీయులకు, ఎమ్మెల్యే వర్గానికి మధ్య పలుసార్లు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. సోషల్‌ మీడియాలోనూ విమర్శలకు దిగుతున్నారు.

మెదక్‌లో మూడు వర్గాలు..మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభా్‌షరెడ్డి మధ్య చాలా కాలంగా సఖ్యత లేదు. వీరికి తోడు కొత్తగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్‌ రాకతో మెదక్‌ బీఆర్‌ఎ్‌సలో మూడు గ్రూపులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే పద్మ, రోహిత్‌ వర్గాలు ఒకరిపై ఒకరు సోషల్‌ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటూనే.. బెదిరింపులకు దిగుతూ పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తుండగా.. మరోవైపు ఈసారి టకెట్‌ను బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆ వర్గం నేతలు ఏమవుతున్నారు. కాగా, షాద్‌నగర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి మధ్య వర్గపోరు తారస్థాయికి చేరుకొంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌పై తీవ్రస్థాయిలో అసమ్మతి వ్యక్తమవుతోంది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2023-07-29T04:34:12+05:30 IST