Share News

Hyderabad: బజార్‌‌ఘాట్‌ అగ్నిప్రమాద మృతులపై ఫైర్ డీజీపీ అధికారిక ప్రకటన

ABN , First Publish Date - 2023-11-13T12:06:36+05:30 IST

Hyderabad: నగరంలోని నాపంల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఏడుగురు సజీవదహనం అయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఫైర్ డీజీపీ నాగిరెడ్డి ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బజార్‌‌ఘాట్ అగ్ని ప్రమాదంలో మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు.

Hyderabad: బజార్‌‌ఘాట్‌ అగ్నిప్రమాద మృతులపై ఫైర్ డీజీపీ అధికారిక ప్రకటన

హైదరాబాద్: నగరంలోని నాపంల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఏడుగురు సజీవదహనం అయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఫైర్ డీజీపీ నాగిరెడ్డి (Fire DGP Nagi Reddy)ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బజార్‌‌ఘాట్ అగ్ని ప్రమాదంలో మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు. అగ్నిప్రమాదంలో సుమారుగా 21 మందిని రెస్క్యూ చేశామని చెప్పారు. 21 మందిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు చనిపోయారని ప్రకటించారు. జనావాసాల మధ్య కెమికల్ డ్రమ్ములు ఉంచారని.. ఆ డ్రమ్ములే అగ్ని ప్రమాదానికి కారణం అయ్యాయని వెల్లడించారు. జనావాసాల మధ్య కెమికల్ డ్రమ్ములు నిలువ చేయడానికి అనుమతి ఉండదని నాగిరెడ్డి స్పష్టం చేశారు.


ప్రమాదం జరిగిందిలా...

నాంపల్లి బజార్‌ఘాట్‌లోని నాలుగు అంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో డీజిల్ డ్రమ్ముల్లో చెలరేగిన మంటలతో ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు అంతస్థుల వరకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. కొందరు సజీవదహనం అవగా... మరికొందరు ఊపిరాడక మృతి చెందారు. కారు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. మరికొంతమంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2023-11-13T12:07:12+05:30 IST