Share News

Hyderabad: వారిని కాపాడాలని ఎంతో ట్రై చేశాం కానీ.. అగ్నిప్రమాదంపై ఫైర్‌ మాన్

ABN , First Publish Date - 2023-11-13T14:20:49+05:30 IST

నాంపల్లి బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలను రెస్క్యూ చేసిన ఫైర్‌మాన్ ఆదర్శ్ మీడియాకు వివరించారు.

Hyderabad: వారిని కాపాడాలని ఎంతో ట్రై చేశాం కానీ.. అగ్నిప్రమాదంపై ఫైర్‌ మాన్

హైదరాబాద్: నాంపల్లి బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో (Nampally Fire Accident) తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రెస్క్యూ చేసిన ఫైర్‌మాన్ ఆదర్శ్ మీడియాకు వివరించారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో (ABN-Andhrajyothy) ఆదర్శ మాట్లాడుతూ... నాంపల్లిలో అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రెండు, మూడు అంతస్థుల్లో ఉన్నవారిని రెస్క్యూ చేసినట్లు తెలిపారు. తమ చేతులతో 21 మందిని రెస్క్యూ చేశామన్నారు. ఒక చిన్న పాపను కూడా చేతులతో ఎత్తుకొని వెళ్లి హాస్పిటల్‌కు తరలించినట్లు ఫైర్ మాన్ వెల్లడించారు.


రెండో అంతస్థులో ఉన్న ఆరు మంది పొగపీల్చి అపస్మారకస్థితిలోకి వెళ్లారని.. లోపలికి వెళ్లి చూసేసరికి ప్రాణాలు కోల్పోయారన్నారు. మూడు, నాలుగు అంతస్థుల్లో ఉన్న వారు గాయాలపాలయ్యారని.. వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తాము లోపలికి వెళ్లే సమయంలో దట్టమైన పొగలు, మంటలు భారీగా ఉన్నాయన్నారు. ఆ పొగకు మంటలకు భయపడి మహిళలు డోర్లు మూసివేయడంతో పొగ మొత్తం చుట్టుకుందన్నారు. ఆ పొగ పీల్చి ప్రాణాలు కోల్పోయారన్నారు. వారిని కాపాడాలని ఎంతో ప్రయత్నం చేశామని.. కానీ దురదృష్టశాత్తు ప్రాణాలు పోయాయని తెలిపారు. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయిందన్నారు. మరోసారి మంటలు వ్యాపించకుండా లోపల ఉన్న ముడి పదార్థాన్ని బయటకు తరలించామని ఆదర్శ్ వెల్లడించారు.

Updated Date - 2023-11-13T14:20:50+05:30 IST