Food Donation: అమావాస్య సందర్భంగా ఖైరతాబాదులో అన్నదానం

ABN , First Publish Date - 2023-03-21T20:29:46+05:30 IST

పెద్ద సంఖ్యలో అన్నార్తులు విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

Food Donation: అమావాస్య సందర్భంగా ఖైరతాబాదులో అన్నదానం

హైదరాబాద్: అమావాస్యను పురస్కరించుకుని నగరంలోని ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం అన్నదానం చేసింది. సంఘ ప్రతినిధులు మంగళవారం నాడు ఖైరతాబాద్ గణైశ్ మండపం వద్ద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల్లోని ప్రధాన కూడళ్లలో ఖైరతాబాద్ ప్రాంతం ఒకటి కావడంతో పెద్ద సంఖ్యలో అన్నార్తులు విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదాన కార్యక్రమానికి ముందు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఆ పరిసరాలలో ఉన్న ఐదు గోశాలల్లో గోసేవ చేశారు. ఈ గోశాలల్లోని ఆవులకు పచ్చిగడ్డిని అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.

అన్నదానం

Updated Date - 2023-03-21T20:29:46+05:30 IST