TS News: ‘మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు.. తైవాన్‌కు రండి’... కేసీఆర్‌కు ఫ్యాక్స్‌కాన్ సీఈవో లేఖ
ABN , First Publish Date - 2023-03-06T13:12:53+05:30 IST
ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు ఫ్యాక్స్‌కాన్ సీఈఓ యంగ్‌లియూ లేఖ రాశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ (CM KCR)కు ఫ్యాక్స్‌కాన్ (Foxconn CEO YoungIiu) సీఈఓ యంగ్‌లియూ లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా కొంగరఖాలాన్ (Kongara khalan)లో ఫ్యాక్స్‌ఖాన్ పార్క్ పెడుతున్నట్లు యంగ్‌లియూ ప్రకటించారు. ఈ పార్క్ ఏర్పాటుకు తమ సహకారం కావాలని అన్నారు. అలాగే కేసీఆర్ (Telangana CM) ను తైవాన్ (Taiwan)కు ఆహ్వానిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్ (Hyderabad) పర్యటనలో భాగంగా తనకు ఏంతో ప్రాముఖ్యత ఇచ్చారని యంగ్‌లియూ తెలిపారు. కొంగరఖలాన్‌లో ఏర్పాటు చేయబోయే పార్క్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం ఇవ్వబోతుందని.. దీనిపై మంత్రి కేటీఆర్ (Minister KTR) ముందుగానే హామీ ఇచ్చినట్లు లేఖలో తెలిపారు. రాబోయే రోజుల్లో ఫ్యాక్స్‌కాన్ పార్క్ ద్వారా లక్షకుపైగా ఉద్యోగాలు రాబోతున్నట్లు చెప్పారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తైవాన్‌కు మధ్య మైత్రి సంబంధాలు కొనసాగాలని పేర్కొన్నారు.