Tamilisai: సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన గవర్నర్
ABN , First Publish Date - 2023-09-08T14:49:57+05:30 IST
గవర్నర్ తమిళిసై, కేసీఆర్ ప్రభుత్వం మధ్య బంధం మరికాస్త గట్టిపడినట్లు తెలుస్తోంది. ఈరోజు (శుక్రవారం) రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్‌పై గవర్నర్ చేసిన పొగడ్తలే ఇందుకు నిదర్శంగా నిలిచాయి. ఇటీవల నూతన సచివాలయంలో గవర్నర్‌కు సీఎం కేసీఆర్ సాదరస్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్‌ను గవర్నర్ పొగడ్తలతో ముంచెత్తారు.
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై (Governor Tamilisai), కేసీఆర్ ప్రభుత్వం మధ్య బంధం మరికాస్త గట్టిపడినట్లు తెలుస్తోంది. ఈరోజు (శుక్రవారం) రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్‌పై (CM KCR) గవర్నర్ చేసిన పొగడ్తలే ఇందుకు నిదర్శంగా నిలిచాయి. ఇటీవల నూతన సచివాలయంలో గవర్నర్‌కు సీఎం కేసీఆర్ సాదరస్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్‌ను గవర్నర్ పొగడ్తలతో ముంచెత్తారు. నాలుగేళ్లు పూర్తి చేసుకొని ఐదవ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తమిళసై పొగడ్తల వర్షం కురిపించారు. కేసీఆర్ ఎంతో అనుభవం, ముందు చూపు ఉన్న నాయకులు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో అప్పట్లో తన ఫోన్ ట్రాప్ చేసారని కామెంట్స్ చేసింది వాస్తవమన్నారు. కొద్దిగా మిస్ కమ్యూనికేషన్ వల్ల అలాంటి వ్యాఖ్యలు జరుగుతాయని... తాను తెలుసుకోవడానికి చాలా సమయం పట్టిందని గవర్నర్ తమిళిసై చెప్పుకొచ్చారు.