Share News

Harish Rao: సర్వేలన్నీ బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్నాయి

ABN , First Publish Date - 2023-11-01T13:19:02+05:30 IST

ఎల్బీనగర్‌లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Harish Rao: సర్వేలన్నీ బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్నాయి

హైదరాబాద్ : ఎల్బీనగర్‌లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడని.. తమతో కలిసి పని చేశాడన్నారు. సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చామని తెలిపారు. కష్టకాలంలో పార్టీ కోసం పని రామ్మోహన్ గౌడ్ పనిచేశారన్నారు. ముక్కు సూటితత్వం ఉన్న మనిషి అని పేర్కొన్నారు. రెండు సార్లు టికెట్ ఇచ్చామని... స్వల్ప మెజార్టీతో ఓడిపోయారని హరీష్ రావు తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటును రామ్మోహన్ గౌడ్ అందించారన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి టికెట్ ఆశించి భంగపడ్డారని హరీష్ రావు తెలిపారు. రామ్మోహన్ గౌడ్ కు బీఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుందన్నారు. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు సైతం తగిన అవకాశాలు ఉంటాయన్నారు.పార్టీ ప్రతినిధిగా తాను వచ్చానన్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదని.. డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారన్నారు. అన్ని సర్వేలు బీ ఆర్ఎస్ గెలుపు ఖాయం అంటున్నాయన్నారు. హైకమాండ్ ఢిల్లీలో ఉండే పార్టీ కావాలా? గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారని హరీష్ రావు తెలిపారు.

Updated Date - 2023-11-01T13:19:02+05:30 IST