Telangana Budget : బడ్జెట్‌లో ఊసేలేని నిరుద్యోగ భృతి హామీ.. ఇంకా ఏవేవంటే..

ABN , First Publish Date - 2023-02-06T10:30:41+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్‎ను మంత్రి హరీష్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‎లో..దళిత బంధుకు భారీగా నిధులు..వేల కోట్ల నిధులు ఇచ్చారు..

Telangana Budget :  బడ్జెట్‌లో ఊసేలేని నిరుద్యోగ భృతి హామీ.. ఇంకా ఏవేవంటే..

తెలంగాణ బడ్జెట్ హైలైట్స్..

  • తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు

  • రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు

  • మూలధన వ్యయం రూ.35,525 కోట్లు

  • బడ్జెట్‌లో ఊసేలేని ఎన్నికల హామీల పథకాలు

  • పేదలకు సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం రూ.3లక్షల సాయం

  • ప్రతి నియోజకవర్గంలో 1,100 మందికి దళితబంధు

  • కొత్తగా మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు

  • ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు

  • బడ్జెట్‌లో ఊసేలేని నిరుద్యోగుల భృతి హామీ

    Untitled-13545.jpg

  • ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త ఈహెచ్ఎస్ విధానం

  • ప్రతి నియోజకవర్గంలో 1,100 మందికి దళితబంధు

  • ఈ ఏడాది 60 జూనియర్, సీనియర్, జిల్లా జడ్జిల కోర్టులు ఏర్పాటు

  • ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

  • ఏప్రిల్ నుంచి సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలు సవరణ

  • మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3వేలకు పెంపు

  • ప్రభుత్వ ప్రకటనలకు రూ.వెయ్యి కోట్లు

  • మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ కోసం రూ.1,500 కోట్లు

  • ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు

  • ఓల్డ్‌ సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు

  • యాదాద్రి ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు

  • మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.200 కోట్లు

  • మహిళా వర్సిటీకి రూ.100 కోట్లు

Untitled-1254.jpg

  • విద్యా రంగానికి రూ.19,093 కోట్లు

  • కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు రూ.200 కోట్లు

  • పల్లె, పట్టణ ప్రగతికి రూ.4,834 కోట్లు

  • డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లకు రూ.12వేల కోట్లు

  • ఆరోగ్యశ్రీకి రూ.14,063 కోట్లు

  • పంచాయతీ రాజ్‌కు రూ.31,426 కోట్లు

  • రుణమాఫీకి రూ.6,385 కోట్లు

  • షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ,.36,750 కోట్లు

  • మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు

  • గ్రామీణ రోడ్లకు రూ.2 వేల కోట్లు

  • హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు

  • పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు

  • రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు

  • పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు

    Untitled-14025.jpg

  • హోంశాఖకు రూ.9,599 కోట్లు

  • మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు

  • రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు

  • రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు

  • వైద్యారోగ్య శాఖకు రూ.12,161 కోట్లు

  • వ్యవసాయ శాఖకు రూ.26,831

  • గిరిజన సంక్షేమం, ప్రభుత్వ ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు

  • నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు

    Untitled-155554.jpg

  • కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు

  • ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు

  • విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు

  • ఆయిల్‌ ఫామ్‌కు రూ.వెయ్యి కోట్లు

  • దళిత బంధుకు రూ.17,700 కోట్లు

  • ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు

  • బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు

  • అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Untitled-9444.jpg

  • తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి నేడు ప్రవేశపెట్టినున్న బడ్జెట్ ప్రతులను హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.

  • తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని తన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి నేడు ప్రవేశపెట్టినున్న బడ్జెట్ ప్రతులను ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు అందజేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి, స్పెషల్ సీఎస్ రామకృష్ణ రావు తదితరులు పోచారంను కలిసిన వారిలో ఉన్నారు.

తెలంగాణ ప్రభుత్వం నేడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే మండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని.. బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఉంటుందని హరీష్ రావు తెలిపారు. కేంద్రం సహకరించక పోయినా.. ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా బడ్జెట్‌ను రూపొందించామన్నారు. తెలంగాణ బడ్జెట్ దేశానికి మోడల్‌గా నిలుస్తుందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-02-06T13:06:46+05:30 IST