CBI Court: భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ
ABN , First Publish Date - 2023-06-06T15:48:47+05:30 IST
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరెస్ట్ అయినా కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది.
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో ఆరెస్ట్ అయినా కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తండ్రి భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy) బెయిల్ పిటిషన్ (Bail Petition)పై మంగళవారం సీబీఐ కోర్టు (CBI Court)లో విచారణ జరుగుతోంది. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయకూడదని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాగా భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు వాదనలు వినిపిస్తున్నారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును న్యాయవాది ప్రస్తావించారు.
వివేకా హత్య కేసులో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని సీబీఐ అధికారులు ఆరెస్ట్ చేశారని న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు అన్నారు. ఆరోపణలు మాత్రమే సీబీఐ పరిగణలోకి తీసుకుందని, భాస్కర్ రెడ్డి సమాజంలో పలుకబడి ఉన్న వ్యక్తి అని, ఒక సీనియర్ సిటిజన్‌ను అక్రమ కేసులో ఇరికించారన్నారు. ఎలాంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి అని, ఆయన నేరం చేశారనడానికి ఎక్కడా సరైన సాక్ష్యాలు లేవన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రస్థావించలేదని అన్నారు. వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వివేకా కూతురు సునీత సీబీఐ కోర్టుకు చేరుకున్నారు.