Hyderabad : నేడు ఈ ఏరియాల్లో బీభత్సమైన ట్రాఫిక్...

ABN , First Publish Date - 2023-09-29T11:33:31+05:30 IST

నల్లకుంట, మాసబ్ ట్యాంక్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఆబిడ్స్ వరకూ గణేష్ విగ్రహాలు క్యూ కట్టాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Hyderabad : నేడు ఈ ఏరియాల్లో బీభత్సమైన ట్రాఫిక్...

హైదరాబాద్ : నల్లకుంట, మాసబ్ ట్యాంక్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఆబిడ్స్ వరకూ గణేష్ విగ్రహాలు క్యూ కట్టాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నెక్లెస్ రోడ్ లోపలికి అధికారులు వినాయకుడిని తరలిస్తున్నారు. ట్యాంక్ బండ్ పైకి భారీగా విగ్రహాలు చేరుకున్నాయి. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్క్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జనాలను అధికారులు ముమ్మరం చేశారు. తెలుగు తల్లి నుంచి నారాయణగూడ వరకూ ఒకవైపు రోడ్డునే అధికారులు అనుమతించారు.

ఆర్బీఐ నుంచి లకిడికపూల్ వరకూ ఒకవైపు రోడ్డునే అనుమతించడం జరిగింది. నిమజ్జనం పూర్తి చేసుకున్న వాహనాలను ఖైరతాబాద్ వైపు నుంచి పంపిస్తున్నారు. రసూల్ పుర జంక్షన్‌లో సైతం భారీగా ట్రాఫిక్ ఉంది. లిబర్టీ, బషీర్బాగ్ , కంట్రోల్ రూమ్, ఆర్బీఐ , మాసబ్ ట్యాంక్ జంక్షన్ లో భారీగా ట్రాఫిక్ చేరుకుంది. ట్యాంక్ బండ్, సచివాలయం మీదుగా వెళ్లే వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ ద్వారా వెళ్లే వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.

Updated Date - 2023-09-29T11:33:31+05:30 IST