Bandi Sanjay : బండి సంజయ్ తీరుపై హైకోర్టు అసహనం.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-09-05T13:35:13+05:30 IST
మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదన్న బీజేపీ నేత బండి సంజయ్ పిటిషన్ పై విచారణ జరిగింది. పిటిషన్ వేసిన బండి సంజయ్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
హైదరాబాద్ : మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదన్న బీజేపీ నేత బండి సంజయ్ పిటిషన్ పై విచారణ జరిగింది. పిటిషన్ వేసిన బండి సంజయ్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యేందుకు పలుమార్లు గడువు కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్‌కు జూలై 21 నుంచి మూడుసార్లు బండి సంజయ్ గడువు కోరారు.
ప్రస్తుతం బండి సంజయ్ అమెరికాలో ఉన్నందున గడువు ఇవ్వాలని ఇవాళ మరోసారి న్యాయవాది కోరారు. ఎన్నికల పిటిషన్లు ఆరు నెలల్లో తేల్చాల్సి ఉన్నందున.. విచారణ ముగిస్తామని హైకోర్టు పేర్కొంది. ఈనెల 12న అమెరికా నుంచి వచ్చాక బండి సంజయ్ హాజరవుతారని న్యాయవాది అభ్యర్థించారు. సైనిక సంక్షేమ నిధికి రూ. 50 వేలు చెల్లించాలని బండి సంజయ్‌కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలంటే సంజయ్ రూ.50 వేలు చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది.