TS High Court: తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2023-09-19T16:18:03+05:30 IST
తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఫుడ్ పాయిజన్(Food poisoning)పై నేడు హైకోర్టు (High Court)విచారణ చేపట్టింది. ఉచిత, నిర్బంధ, విద్య హక్కు నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదని పిటీషనర్ వాదనలు వినిపించారు.
హైదరాబాద్: తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఫుడ్ పాయిజన్(Food poisoning)పై నేడు హైకోర్టు (High Court)విచారణ చేపట్టింది. ఉచిత, నిర్బంధ, విద్య హక్కు నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదని పిటీషనర్ వాదనలు వినిపించారు. SC, ST, BC, మైనార్టీ బాలికలు, బాలురు జీవించే హక్కును కలిగి ఉన్నారని పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తెలిపారు. నాణ్యమైన ఆహారం లేకపోవడంతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.మంచినీరు, కిచెన్, మరుగుదొడ్లు పరిశుభ్రత లేక విద్యార్థులు కడుపు నొప్పి, తలనొప్పి, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని పిటీషనర్ కోర్టుకు తెలిపారు. సమగ్ర నివేదికను సమర్పించాలని రాష్ట్రా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. విచారణ అక్టోబర్ 6వ తేదీకు హైకోర్టు వాయిదా వేసింది.