Humayun Nagar Incident: తమ్ముడిపై అన్నదాడి.. ఘర్షణకు కారణమేంటంటే..?

ABN , First Publish Date - 2023-09-09T22:17:07+05:30 IST

ఇంటి స్థలం విషయంలో తమ్ముడిపై అన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ (Humayun Nagar Police Station) పరిధిలో నసిర్‌ఖాన్ , ఇమ్రాన్‌ఖాన్(Nasir Khan, Imran Khan) అన్నదమ్ములు నివశిస్తున్నారు.

Humayun Nagar Incident: తమ్ముడిపై అన్నదాడి.. ఘర్షణకు కారణమేంటంటే..?

హైదరాబాద్: ఇంటి స్థలం విషయంలో తమ్ముడిపై అన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ (Humayun Nagar Police Station) పరిధిలో నసిర్‌ఖాన్ , ఇమ్రాన్‌ఖాన్(Nasir Khan, Imran Khan) అన్నదమ్ములు నివశిస్తున్నారు. వీరిద్దరికి ఉన్న స్థలంపై కోర్టులో కేసు నడుస్తోంది. శనివారం నసిర్‌ఖాన్ భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అది కాస్తా అన్నదమ్ముల వివాదంగా మారింది. దీంతో ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. పెద్ద పెద్ద అరుపులు విన్న ఇమ్రాన్ ఖాన్ అన్న నసిర్‌ఖాన్ దగ్గరకు వెళ్లి అడిగే సరికి తన చేతిలో ఉన్న కత్తితో తమ్ముడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇమ్రాన్‌ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలతో ఉన్న ఇమ్రాన్ హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గాయాలతో ఉన్న ఇమ్రాన్‌ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసి నసిర్‌ఖాన్ పారిపోయాడు. దీంతో నసిర్‌ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2023-09-09T22:28:00+05:30 IST