Hyderabad: గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వైపు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలియకపోతే ఇబ్బందే..!
ABN , First Publish Date - 2023-05-29T14:08:22+05:30 IST
గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వెళ్లే రోడ్డుపై జీహెచ్‌ఎంసీ శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నిమిత్తం కారణంగా తలెత్తుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు..
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలి జంక్షన్ (Gachibowli Junction) నుంచి కొండాపూర్ (Kondapur) వెళ్లే రోడ్డుపై జీహెచ్‌ఎంసీ శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నిమిత్తం కారణంగా తలెత్తుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు (Hyderabad Traffic) చెక్ పెట్టేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ ప్రయత్నిస్తున్నారు. ఈ మార్గంలో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను తాజాగా ఆయన సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా, వాహనదారులు ఇబ్బందులు పడకుండా.. రద్దీని నివారించేందుకు ప్రత్యామ్నాయ రహదారులను సూచించారు. మీడియా ప్రతినిధులను ఆంక్షలున్న రోడ్లకు ప్రత్యామ్నాయ రోడ్ల ద్వారా తీసుకెళ్లి.. వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ఎలా వెళ్లాలో వివరించారు.
* ఓఆర్‌ఆర్ నుంచి హఫీజ్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్ గచ్చిబౌలి జంక్షన్ ద్వారా మళ్లించి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ మీదుగా- మీనాక్షి టవర్స్- డెలాయిట్- ఏఐజీ ఆస్పత్రి- క్యూమార్ట్- కొత్తగూడ ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్‌పేట్ వెళ్లాలి.
* లింగంపల్లి నుంచి కొండాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్- డీఎల్‌ఎఎఫ్ రోడ్- రాడిసన్ హోటల్ - కొత్తగూడ మీదుగా - కొండాపూర్ వైపు వెళ్లాలి.
ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్దాం..
* విప్రో జంక్షన్ నుంచి ఆల్విన్ క్రాస్‌రోడ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. ఎడమ వైపు టర్న్ చేసి-గచ్చిబౌలి స్టేడియం వద్ద యూటర్న్- డీఎల్‌ఎఫ్ రోడ్- రాడిసన్ హోటల్ -కొత్తగూడ, ఆల్విన్ క్రాస్‌రోడ్స్ వైపు వెళ్ళాలి.
* టోలిచౌకి నుంచి అల్విన్ క్రాస్‌రోడ్స్ వైపు వచ్చే ట్రాఫిక్... బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ - మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద మళ్లించి - సైబర్ టవర్స్ జంక్షన్ - హైటెక్స్ సిగ్నల్ ఎడమ వైపు - కొత్తగూడ జంక్షన్ ద్వారా వెళ్లాలి.
* టెలికాంనగర్ నుంచి కొండాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ గచ్చిబౌలి వద్ద ఫ్లైఓవర్ కింద యూటర్న్ ద్వారా మళ్లించి- శిల్పలేఅవుట్ ఫ్లైఓవర్- మీనాక్షి టవర్స్- డెలాయిట్- ఏఐజీ ఆస్పత్రి- క్యూమార్ట్- కొత్తగూడ ఫ్లైఓవర్ ద్వారా వెళ్ళాలి.
* అల్విన్ క్రాస్‌రోడ్స్ నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్ కొత్తగూడ జంక్షన్ వద్ద మళ్లించి హైటెక్స్ రోడ్డు వైపు - సైబర్ టవర్స్ - మైండ్‌స్పేస్ జంక్షన్ - శిల్పాలేఅవుట్ ఫ్లైఓవర్- గచ్చిబౌలి ద్వారా వెళ్లాలి.
* అల్విన్ క్రాస్‌రోడ్స్ నుంచి లింగంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్ బొటానికల్ గార్డెన్ జంక్షన్ వద్ద నుంచి - మసీదుబండ - హెచ్‌సీయూ డిపో లింగంపల్లి ద్వారా వెళ్ళాలి.
* కూకట్‌పల్లి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్లాల్సిన వారు సైబర్ టవర్స్ - ఐకియా అండర్‌పాస్, బయోడైవర్సిటీ - రైట్ టర్న్ - గచ్చిబౌలి మీదుగా వెళ్ళాలి. అలాగే రివర్స్ ట్రాఫిక్ అదే మార్గంలో వెళ్ళాలి.
* టీహబ్ రోడ్లను ఉపయోగించుకునే విధంగా కేబుల్ బ్రిడ్జ్ - కోహినూర్ హోటల్ - తంగేడు రెస్టారెంట్ - ఖాజాగూడ వైపునకు, అలాగే రివర్స్‌ట్రాఫిక్ అదే మార్గంలో వెళ్ళాలి.
* ఐకియా రోటరీ వద్ద మూడు యూ టర్న్‌లను.. సీగేట్ వద్ద, ఎన్‌సీసీ ముందు, ఐకియా స్టోర్ వద్ద ఇవ్వడం జరిగింది. రోటరీ చిన్నది కావటంతో ట్రాఫిక్ ఆగకుండా ఏర్పాట్లు చేశారు.
* హైటెక్స్ వద్ద యూటర్న్ ఏర్పాటు చేసి టెక్ మహీంద్రా, లెమన్‌ట్రీ హోటల్ మీదుగా ట్రాఫిక్ రెండు వైపులా సజావుగా వెళేలా ఏర్పాట్లు చేశారు.