Bandi Sanjay: సిట్‌పై నాకు నమ్మకం లేదు...

ABN , First Publish Date - 2023-03-26T11:39:33+05:30 IST

టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ (Paper leakage) ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)కు సిట్ అధికారులు నిన్న (శనివారం) మరోసారి నోటీసులు ఇచ్చారు.

Bandi Sanjay: సిట్‌పై నాకు నమ్మకం లేదు...

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ (Paper leakage) ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)కు సిట్ అధికారులు (SIT Officials) నిన్న (శనివారం) మరోసారి నోటీసులు (Notice) ఇచ్చారు. దీనిపై స్పందించిన సంజయ్ సమాధానం ఇచ్చారు. తనకు సిట్‌పై నమ్మకం లేదని అన్నారు. పార్లమెంట్ సమావేశాల (Parliament Meetings) నేపథ్యంలో బిజీగా ఉన్నానని, ఇదే విషయాన్ని ఇప్పటికే తెలిపానని, అయినా మళ్ళీ నోటీసులు ఇచ్చారన్నారు. ‘‘మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను.. ఆ బాధ్యత గల మంత్రులు ఇద్దరు మాత్రమే ఉన్నారు.. లీక్‌లో చాలా మంది ఉన్నారని, సిట్ హెడ్‌గా మీకూ తెలుసు.. స్కాంను తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం మొదటి నుంచి జరుగుతోంది.. రాజకీయాలను పక్కన పెట్టి మీ ఆత్మ సాక్షితో ఆలోచించండి.. ఈ స్కాంతో ఎన్నో లక్షల మంది మనో వేదనకు గురవుతున్నారు.. ఒక గ్రామం నుంచి ఎక్కువ మంది గ్రూప్ వన్‌కు సెలెక్ట్ అయ్యారని సమాచారం నాకు వచ్చింది.. దాన్ని ప్రజల ముందు పెట్టాను’’ అని పేర్కొన్నారు.

ప్రజా ప్రతినిధిగా వివిధ మార్గాల నుంచి తనకు సమాచారం వస్తుందని, ఈ సమయంలో పూర్తి వివరాలను బహిర్గతం చేయడం భావ్యం కాదని అనుకుంటున్నానని బండి సంజయ్ అన్నారు. అసలు విషయంపై విచారణ జరపకుండా తనకు నోటీస్‌లు ఇవ్వడానికే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తాను హాజరు కావడం లేదని మరోసారి స్పష్టం చేశారు. కాగా బండి సంజయ్‌కు బదులుగా ఆదివారం హిమాయత్ నగర్ సీట్ ఆఫీస్‌కు ఆయన లీగల్ టీమ్ చేరుకుంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-03-26T11:39:33+05:30 IST