Hyderabad: నారాయణగూడలో నడిరోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు.. ఎందుకోసమో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-07-01T17:21:36+05:30 IST
వారంతా ఒకే తరగతి విద్యార్థులు. ఒకే కాలేజీ కూడా.. రోజూ క్లాస్‌కు వస్తున్నారు.. వెళ్తున్నారు. ఉన్నట్టుండి రెండు వర్గాలుగా విడిపోయి కాలేజీ ఎదుటే కొట్టుకున్నారు. ఈ పంచాయితీ కాస్త పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఏం జరిగింది అని ఖాకీలు ఆరా తీస్తే ఓ అమ్మాయి కోసం కొట్టుకున్నట్లు తేలింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: వారంతా ఒకే తరగతి విద్యార్థులు. ఒకే కాలేజీ కూడా.. రోజూ క్లాస్‌కు వస్తున్నారు.. వెళ్తున్నారు. ఉన్నట్టుండి రెండు వర్గాలుగా విడిపోయి కాలేజీ ఎదుటే కొట్టుకున్నారు. ఈ పంచాయితీ కాస్త పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఏం జరిగింది అని ఖాకీలు ఆరా తీస్తే ఓ అమ్మాయి కోసం కొట్టుకున్నట్లు తేలింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థుల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్ కలకలం రేపుతోంది. ఒకే అమ్మాయిని ఇద్దరు విద్యార్థులు ప్రేమించడంతో కాలేజీలో రగడ మొదలైంది. దీంతో విద్యార్థులు రెండు గ్రూప్‌లుగా విడిపోయి కాలేజీ ఎదుట కొట్టుకున్నారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం కేశవ్ మెమోరియల్ కాలేజీ దగ్గర చోటుచేసుకుంది.
ఎంపీసీ (MPC) సెకండియర్ చదువుతున్న ఓ అమ్మాయి మరొకరితో క్లోజ్‌గా ఉండటంతో ఆమె స్నేహితుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో అతడు.. ఆ విద్యార్థితో గొడవకు దిగాడు. ఈ పరిణామంతో ఇంటర్ సెకండియర్ విద్యార్థులంతా రెండు వర్గాలుగా విడిపోయి కాలేజీ గేటు ముందు ఘర్షణకు దిగి కొట్టుకున్నారు. ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరడంతో విద్యార్థులపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే విద్యార్థులందరూ మైనర్లుగా పోలీసులు గుర్తించారు.