Chikoti Praveen : రూ.3 కోట్ల కారు వ్యవహారంలో చికోటికి ఐటీ నోటీసులు

ABN , First Publish Date - 2023-02-28T08:45:19+05:30 IST

కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కి ఐటీ నోటీసులు జారీ చేసింది. రూ.3 కోట్ల కారు వ్యవహారంలో ఐటీ నోటీసులు జారీ చేసింది. మూడు కోట్ల రూపాయల విలువ చేసే రేంజ్ రోవర్ కారు వ్యవహారంలో చికోటి ఐటీ నుంచి నోటీసులు అందుకున్నారు.

Chikoti Praveen : రూ.3 కోట్ల కారు వ్యవహారంలో చికోటికి ఐటీ నోటీసులు

Chikoti Praveen : కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కి ఐటీ నోటీసులు జారీ చేసింది. రూ.3 కోట్ల కారు వ్యవహారంలో ఐటీ నోటీసులు జారీ చేసింది. మూడు కోట్ల రూపాయల విలువ చేసే రేంజ్ రోవర్ కారు వ్యవహారంలో చికోటి ఐటీ నుంచి నోటీసులు అందుకున్నారు. బినామీ పేరు మీద చికోటి ప్రవీణ్ కారు చేశారు. మీ కారును ఎందుకు సీజ్ చేయకూడదంటూ షోకాజు నోటీసులు జారీ చేసింది. భాటియా ఫర్నిచర్ పేరుతో చికోటి కారును కొనుగోలు చేశాడు. ఇప్పటికే చికోటి ఫెమా కేసును ఎదుర్కొంటున్నారు. క్యాసినో వ్యవహారంలో ఇప్పటికే చికోటి ప్రవీణ్ విచారణ ఎదుర్కొంటున్నారు.

ఒక చిన్న సిరామిక్ టైల్స్ వ్యాపారిగా తన జీవితాన్ని మొదలు పెట్టాడు చికోటి ప్రవీణ్. అనంతరం సినిమాలంటే ఆసక్తి ఉండడంతో.. నిర్మాతగా మారిపోయాడు. కానీ సినిమాలు తీయాలంటే ఆసక్తి ఒక్కటి సరిపోదుగా.. బాగా దెబ్బ పడింది. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అయితే, అప్పుల నుంచి బయటపడేందుకు వనస్థలిపురంలో ఒక డాక్టర్‌ను కిడ్నాప్‌ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయి జైలుకు సైతం వెళ్లాడు. ఇక ఆ తర్వాత గోవాలో ఓ పేకాట క్లబ్‌లో కొన్ని టేబుళ్లను అద్దెకు తీసుకుని పేకాట నిర్వహించడం మొదలు పెట్టాడు.

చికోటి ప్రవీణ్ తొలినాళ్లలో కేవలం జంట నగరాల్లో అది కూడా సెలబ్రిటీల కోసమే క్యాసినో నిర్వహించాడు. అనంతరం చిన్న చిన్న పార్టీలు ఇస్తూ తద్వారా పరిచయాలు పెంచుకుని తన క్యాసినో సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ తరువాత రాజకీయ నేతలతో పరిచయాలు ఆయన సామ్రాజ్యాన్ని మరింత విస్తృతం చేశాయి. చికోటి చీకటి వ్యాపారం రాష్ట్రాల ఎల్లలు.. ఆపై దేశాల ఎల్లలు దాటింది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్లు సైతం చికోటి కస్టమర్ల లిస్ట్‌లో ఉన్నార‌ట‌. చికోటి ఎంతలా ఎదిగాడంటే.. ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్‌కు కస్టమర్లను తీసుకెళ్లి కోట్ల రూపాయలతో పేకాట ఆడించే స్థాయికి చేరుకున్నాడు. గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ నిర్వహించిన సోదాలతో చికోటి చీకటి సామ్రాజ్యపు పునాదులు కదలడం ప్రారంభించాయి.

Updated Date - 2023-02-28T08:45:19+05:30 IST