Share News

TS Assembly polls: AMR గ్రూప్ సంస్థల్లో ఐటీ రైడ్స్.. అంత డబ్బు ఏ పార్టీ కోసం?

ABN , First Publish Date - 2023-10-21T13:30:49+05:30 IST

భాగ్యనగరంలో మరోసారి ఐటీ సోదాల కలకలం రేగింది. శనివారం ఏఎంఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. ఏఎంఆర్ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ మహేష్‌రెడ్డిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

TS Assembly polls: AMR గ్రూప్ సంస్థల్లో ఐటీ రైడ్స్.. అంత డబ్బు ఏ పార్టీ కోసం?

హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి ఐటీ సోదాల కలకలం రేగింది. శనివారం ఏఎంఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. ఏఎంఆర్ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ మహేష్‌రెడ్డిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో మొత్తం 12 చోట్ల ఐటీ, ఈసీ సోదాలు చేస్తోంది. తనిఖీల్లో భాగంగా రూ.3.50 కోట్ల నగదును టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. బంజారాహిల్స్‌ తనిఖీలో నగదు పట్టుబడింది. పక్క రాష్ట్రాల నుంచి రూ.3.50 కోట్లు తీసుకొస్తుండగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్.. ఆ డబ్బు మొత్తాన్ని ఐటీకి అప్పగించింది. టాస్క్‌ఫోర్స్‌ సమాచారంతో ఏఎంఆర్‌లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి డబ్బులు తెచ్చి పార్టీకి ఇస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీ కోసం డబ్బులు తెస్తున్నారనే దానిపై ఐటీ ఆరా తీస్తోంది. ఐటీ, ఎలక్షన్‌ స్పెషల్‌ సెల్‌ సంయుక్తంగా సోదాలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2023-10-21T13:37:35+05:30 IST