IT Raids: హైదరాబాద్‌లో చెన్నై కంపెనీపై ఐటీ దాడులు

ABN , First Publish Date - 2023-04-24T10:58:20+05:30 IST

చెన్నైకి చెందిన రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ జీ స్వ్కేర్ సంస్థ‌పై ఐటీ దాడులు సోమవారం ఉదయం సోదాలు నిర్వహించారు.

IT Raids: హైదరాబాద్‌లో చెన్నై కంపెనీపై ఐటీ దాడులు

హైదరాబాద్: చెన్నైకి చెందిన రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ జీ స్వ్కేర్ సంస్థ‌పై (G Square organization) ఐటీ దాడులు (IT Raids) సోమవారం ఉదయం సోదాలు నిర్వహించారు. తమిళనాడులోని చెన్నైతో పాటు దాదాపు 50 ప్రాంతాల్లో గల సంస్థ కార్యాలయాలపై ఐటీ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. సౌత్ ఇండియాలోనే ఈ సంస్థ వందల సంఖ్యలో ప్రాజెక్టులు చేపట్టింది. సౌత్ ఇండియాలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళల రాష్ట్రాల్లో జీస్క్వేర్ సంస్థ బిజినెస్ చేస్తోంది. అయితే ఈ సంస్థ భారీ స్థాయిలో ప‌న్ను ఎగ‌వేత‌కు పాల్ప‌డిందంటూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కొనుగోలుదారుల నుంచి అధిక స్థాయిలో ఈ సంస్థ‌ న‌ల్ల‌ధ‌నాన్ని వ‌సూలు చేసింద‌నే ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో దాదాపు 50 ప్రదేశాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో రెండు వెంచర్లను జీ స్క్వేర్ సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతం ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2023-04-24T14:43:39+05:30 IST