Ganesh nimajjanam 2023: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం జోష్
ABN , First Publish Date - 2023-09-28T07:09:39+05:30 IST
భాగ్యనగరం హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన వినాయక నిమజ్జనం సందడి కనిపిస్తోంది. 10 రోజులపాటు విశేష పుజాసేవలు అందుకున్న గణనాథులు.. వెళ్లొస్తానంటూ నిమజ్జనానికి కదిలివెళ్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి విగ్రహాలు ఊరేగింపు సందడిగా మొదలైంది.
హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన వినాయక నిమజ్జనం సందడి కనిపిస్తోంది. 10 రోజులపాటు విశేష పుజాసేవలు అందుకున్న గణనాథులు.. వెళ్లొస్తానంటూ నిమజ్జనానికి కదిలివెళ్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి విగ్రహాలు ఊరేగింపు సందడిగా మొదలైంది. తెలుగుతల్లి ప్లైఓవర్ దగ్గర నుంచి భారీగా విగ్రహాలు తరలివెళ్తున్నాయి. దీంతో రాత్రి నుంచి భారీ క్యూ ఏర్పడింది. విగ్రహాలు కదిలివెళ్తున్న తెలుగుతల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, లుంబినీ పార్క్ ప్రాంతాలు సందడిగా మారిపోయాయి. యువత పెద్ద సంఖ్యలో ఈ ఉత్సాహంగా ఊరేగింపులో కనిపిస్తున్నారు.
మధ్యాహ్నం 1.30లోపు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం..
ఖైరతాబాద్ భారీ గణపతి నిమజ్జనం జరుగుతున్న హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు అన్ని శాఖలు మోహరించనున్నాయి. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, అధికారులు మహా నిమజ్జనం ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. బాలాపూర్ నుంచి చాంద్రాయణగుట్ట, హుస్సేన్‌సాగర్, మోజంజాహీ మార్కెట్ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర జరిగే మార్గాన్నివారు పరిశీలించారు. ఎన్‌టీఆర్ మార్గ్‌లో ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేసే క్రేన్ నెంబర్-4 వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఇక అత్యంత కీలకమైన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మధ్యాహ్నం 1.30లోపు జరిగేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. అధికార యంత్రాంగం వినాయక విగ్రహాల నిమజ్జనానికి 74 ప్రాంతాల్లో కృత్రిమ కొలనులను సిద్ధం చేసింది. భక్తుల సౌకర్యార్థం అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రోరైల్ సేవలు కొనసాగుతాయని హెచ్‌ఎంఆర్‌ఎల్ వర్గాలు తెలిపాయి.