KCR: ఇలాంటివి మళ్లీ రిపీట్ కావద్దంటూ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ హెచ్చరిక

ABN , First Publish Date - 2023-03-10T20:37:35+05:30 IST

ఇలాంటివి మళ్లీ రిపీట్ కావద్దంటూ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ హెచ్చరించారు.

KCR: ఇలాంటివి మళ్లీ రిపీట్ కావద్దంటూ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ హెచ్చరిక

హైదరాబాద్: దళితబంధు అమలు తీరుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) సీరియస్ అయ్యారు. దళితబంధు కోసం కొందరు ఎమ్మెల్యేలు (MLAs) డబ్బులు తీసుకుంటున్నారని, వరంగల్‌, ఆదిలాబాద్‌లో కొందరు డబ్బులు వసూలు చేశారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమాచారం అంతా తన దగ్గర ఉందని, ఇలాంటివి మళ్లీ రిపీట్ కావద్దంటూ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ హెచ్చరించారు. బీఆర్ఎస్‌ (BRS) విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని, నేతలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ తీరును గట్టిగా ఎండగట్టాలని, బీఆర్ఎస్‌ ప్రభుత్వం చేస్తోన్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ చెప్పారు. మనం ఏ తప్పు చేయనప్పుడు ఏ సంస్థకూ భయపడాల్సిన పనిలేదని, బీఆర్ఎస్‌ నేతలంతా పాదయాత్రలు చేయాలని కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారు. ఏప్రిల్‌ 27న ఎల్బీ స్టేడియంలో బీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశం జరుగుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Updated Date - 2023-03-10T20:37:35+05:30 IST