Khairatabad Ganesh: నిర్మానుష్యంగా ఎన్టీఆర్ మార్గ్.. బడా గణేశ్ నిమజ్జనానికి రూట్ క్లియర్
ABN , First Publish Date - 2023-09-28T10:52:39+05:30 IST
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆ దేవదేవుడికి వీడ్కోలు పలికేందుకు ట్యాంక్‌బండ్‌కు భక్తులు తరలివస్తున్నారు.
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆ దేవదేవుడికి వీడ్కోలు పలికేందుకు ట్యాంక్‌బండ్‌కు భక్తులు తరలివస్తున్నారు. ఐదు గంటలుగా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి సెక్రటేరియట్‌కు చేరుకున్నాడు. సెక్రెటేరియట్ ముందు యువత ఆటపాటలతో హంగామా చేశారు. మరోవైపు మహాగణపతి నిమజ్జనానికి పోలీసులు రూట్ క్లియర్ చేస్తున్నారు. మహాగణపతి నిమజ్జనం జరిగే ప్రాంతంలో భక్తులను పోలీసులు పంపించి వేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ మార్గ్ నిర్మానుష్యంగా మారింది. కాసేపట్లో క్రేన్ నెంబర్ 4కు ఖైరతాబాద్ గణపతి చేరుకోనున్నారు. చరిత్రలోనే తొలిసారిగా బడా గణేశ్ నిమజ్జనం మధ్యాహ్నం 12 గంటల లోపు జరుగనుంది. ఈరోజు ఉదయం 6 గంటలకే మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమవగా.. అక్కడి నుంచి టెలిఫోన్ భవన్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా క్రేన్ నెంబర్ 4కు మహాగణపతి చేరుకోనున్నాడు.