Hyd CP: హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-12-12T12:58:21+05:30 IST
Telangana: కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ బదిలీలకు మొదటి సారి శ్రీకారం చుట్టారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth reddy) బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ బదిలీలకు మొదటి సారి శ్రీకారం చుట్టారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నూతన సీపీగా కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి (Hyderabad CP Kotha kota Srinivasreddy) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సీపీగా సుధీర్ బాబు (Rachakonda CP Sudhirbabu), సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి (Syberabad CP Avinash Mahanti) నియమితులయ్యారు. అలాగే హైదరాబాద్ పాత సీపీ సందీప్ శాండిల్యాను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ చౌహన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.