Drugs Case: పోలీస్ కస్టడీకి కేపీ చౌదరి
ABN , First Publish Date - 2023-06-22T10:48:52+05:30 IST
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరిని రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గోవా నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తూ పోలీసులకు చౌదరి పట్టుపడ్డారు. రెండు రోజులపాటు కస్టడీకి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్: డ్రగ్స్ కేసు (Drugs Case)లో సినీ నిర్మాత కేపీ చౌదరి (KP Choudary)ని రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గోవా (Goa) నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తూ పోలీసులకు చౌదరి పట్టుపడ్డారు. రెండు రోజులపాటు కస్టడీకి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో 14 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని రాజేంద్రనగర్ పీఎస్‌కు తరలించారు. ఈరోజు, రేపు విచారించనున్నారు. సినిమావాళ్లతో లింకులు ఏమైనా ఉన్నాయా? అని లోతుగా ఆరా తీసే అవకాశం ఉంది.
గోవా నుంచి 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకు రాగా.. 90 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 ప్యాకెట్లు ఎవరికి అమ్మరన్న దానిపై పోలీసుల దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్‌తో సినీ డ్రగ్స్ లింక్స్ తెర మీదకు వచ్చాయి. కేపీ చౌదరి అరెస్ట్‌తో పలువురు సెలబ్రిటీల్లో గుబులు నెలకొంది.
రోషన్ అనే డ్రగ్స్ ఫెడ్లర్ విచారణలో కేపీ చౌదరి వ్యవహారం వెలుగు చూసింది. ప్రైవేట్ పార్టీలకు హాజరైన పలువురి ప్రముఖుల ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని ఆధారంగా కేపీ చౌదరి నిర్వహించిన పార్టీలకు హాజరైన సెలబ్రిటీల లిస్ట్‌ను పోలీసులు తయారు చేస్తున్నారు. గోవా, హైదరాబాద్‌లో ప్రైవేట్ పార్టీలు నిర్వహించిన కేపీ చౌదరికి సంబంధించిన 4 మొబైల్స్‌ను పోలీసుుల స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ 4 ఫోన్‌ల నుంచి కాల్ డేటా తీస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్ట్‌లు.. ఒక డైరెక్టర్‌తో డ్రగ్స్ వ్యవహారంపై కేపీ చౌదరి చేసిన చాటింగ్‌ను గుర్తించారు. డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియన్ గాబ్రియేల్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కీలక అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉందని సమాచారం.