Congress: ఎంపీ కోమటిరెడ్డి నివాసంలో కీలక నేతల సమావేశం
ABN , First Publish Date - 2023-07-19T15:35:21+05:30 IST
తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) చేరికల జోష్ (Josh) కనిపిస్తోంది. పార్టీలోకి చేరికలు పెరుగుతుండడంతో పార్టీ ముఖ్యనేతలు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komatireddy Venkat Reddy) నివాసంలో ముఖ్యనేతలు భేటీ అయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) చేరికల జోష్ (Josh) కనిపిస్తోంది. పార్టీలోకి చేరికలు పెరుగుతుండడంతో పార్టీ ముఖ్యనేతలు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komatireddy Venkat Reddy) నివాసంలో ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy), మాణిక్‌రావు ఠాక్రే (Manik Rao Thackeray), ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)తోపాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. ప్రధానంగా ఈ భేటీలో పార్టీలో చేరికలపై చర్చిస్తున్నారు. చర్చల అనంతరం ఠాక్రే, రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. గురువారం పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
గద్వాల జడ్పీఛైర్ పర్సన్ తిరుపతయ్య, మాజీ ఎమ్మెల్యే వేణుల వీరేశం, సునీల్ రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డితో ఠాక్రే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్‌లో చేరికపై ఇవాళ స్పష్టత రానుంది. కృష్ణారెడ్డితోపాటు ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది.
ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదరరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, ఎనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.