Liquor Outlets: లిక్కర్ షాపుల లైసెన్సుల జారీకి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు..

ABN , First Publish Date - 2023-08-02T21:46:13+05:30 IST

లిక్కర్ షాపుల లైసెన్సుల జారీకి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత విధానం ద్వారానే మద్యం దుకాణాల లైసెన్సులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు ఫీజు, లైసెన్స్‌ ఫీజులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. గురువారం (ఆగస్ట్ 3, 2023) నుంచి జిల్లాల వారీగా అబ్కారీ శాఖ నోటిఫికేషన్‌ ఇవ్వనుంది.

Liquor Outlets: లిక్కర్ షాపుల లైసెన్సుల జారీకి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు..

హైదరాబాద్: లిక్కర్ షాపుల లైసెన్సుల జారీకి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత విధానం ద్వారానే మద్యం దుకాణాల లైసెన్సులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు ఫీజు, లైసెన్స్‌ ఫీజులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. గురువారం నుంచి జిల్లాల వారీగా అబ్కారీ శాఖ నోటిఫికేషన్‌ ఇవ్వనుంది.

* ఈ నెల 4 నుంచి 18 వరకు దరఖాస్తుల స్వీకరణ

* ఈ నెల 21న డ్రా ద్వారా మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక

* నవంబరు 30 నాటికి ముగియనున్న లిక్కర్ షాపుల లైసెన్సుల గడువు

* దరఖాస్తు రుసుము రూ.2 లక్షలుగా పేర్కొన్న ప్రభుత్వం

* తెలంగాణలో 2,620 లిక్కర్ షాపులకు నోటిఫికేషన్‌


ఎన్నికల ఏడాదిలో ముందస్తుగా మద్యం దుకాణాల వేలానికి ప్రభుత్వం వెళ్తోంది. మద్యం దుకాణాల గడువు నవంబరుతో ముగుస్తుండటంతో డిసెంబరు నుంచి ప్రారంభం కానున్న కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ఈ ఏడాది మాత్రం ఆగస్టులోనే రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అధికారులు ప్రక్రియ షురూ చేశారు. ప్రతి రెండేళ్లకోసారి మద్యం దుకాణాల వేలం జరుగుతుంది. 2021 నుంచి 2023 కాలానికి 2021 నవంబరులో వేలం పూర్తి చేశారు. 2023 నవంబరు వరకు ప్రస్తుత మద్యం దుకాణాల యజమానులకు సమయం ఉంది. అయితే ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు రానుండటంతో 2023-2025 రెండేళ్ల కాలానికి గాను కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-08-02T21:46:41+05:30 IST