Maheshwar Reddy: కాంగ్రెస్ పార్టీలో నన్ను అవమానించారు...
ABN , First Publish Date - 2023-04-13T17:27:27+05:30 IST
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో తనను అవమానించారని, షోకాజ్ నోటీసు తెచ్చి గంటలోపే వివరణ ఇవ్వాలని కోరారని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) అన్నారు.
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో తనను అవమానించారని, షోకాజ్ నోటీసు తెచ్చి గంటలోపే వివరణ ఇవ్వాలని కోరారని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) అన్నారు. గురువారం ఆయన జేపీ నడ్డా (JP Nadda) సమక్షంలో బీజేపీ (BJP)లో చేరారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhra Jyothy)తో మాట్లాడుతూ 11 ఏళ్లు పార్టీలో నిబద్ధతగా పనిచేశానని.. కావాలనే నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు చేశారని అన్నారు. అవమానం భరించలేక పార్టీ నుంచి వెళ్ళిపోయానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) ఒకటేనని కార్యకర్తలు అనుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి మనవడు పుడితే ఫోన్ చేసి విషెస్ చెప్పానని, నన్ను పిలిచి మాట్లాడితే బాగుండునని అన్నారు. చాలామంది నేతలు పార్టీ నుంచి బయటికి వస్తారన్నారు. తనపై సోషల్ మీడియాలో ప్రచారాలు చేశారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇంకా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఏ రోజు నేను పార్టీ గీత దాటలేదు. అంతర్గత సమావేశాల్లో మాత్రమే నేను మాట్లాడినా. రేవంత్ వెలుమ కమ్యూనిటీ మీద మాట్లాడినప్పుడు మాత్రమే నేను మాట్లాడలేదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి అంటే నాకు అభిమానం. సీనియర్ల మీటింగ్ నా ఇంట్లో ఉంటే దిగ్విజయ్ కోరిక మేరకు వాయిదా వేశాం. జనరల్ సెక్రటరీని మార్చమని మేము ఎప్పుడూ కోరలేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా. షోకాజ్ ఇవ్వడం బాధాకరం. ఖర్గేను కలిసి నిర్ణయం తీసుకుంటా. నేను పార్టీ మారాలంటే బాజాప్త రాజీనామ చేసి వెళతా. నేను పార్టీ మారాలని ఏ రోజు అనుకోలేదు నా సమావేశాలకు బీజేపీ నేత అటెండ్ అయ్యారనే ది పచ్చి అబద్ధం. అమిత్ షాను బీజేపీ పెద్దలను కలిసేవారికి షోకాజ్ ఇచ్చే దైర్యం లేదు. కానీ నాకు ఎందుకు ఇచ్చారో అర్దం కావడం లేదు’’ అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.