Mynampally : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం?

ABN , First Publish Date - 2023-08-22T13:39:21+05:30 IST

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. మైనంపల్లి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. మైనంపల్లి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నాయి.

Mynampally : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం?

హైదరాబాద్ : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. మైనంపల్లి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. మైనంపల్లి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నాయి. మైనంపల్లిపల్లిపై సొంత పార్టీ నేతలు మండి పడుతున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే మైనంపల్లి వ్యాఖ్యలను కేటీఆర్, కవిత ఖండించారు. ఈ క్రమంలోనే ఆయనపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

నిన్న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడటానికి ముందే తన కుమారుడు రోహిత్‌కు టికెట్ ఇస్తే సరి.. లేదంటే ఊరుకోబోనంటూ సంచలనానికి మైనంపల్లి తెరదీశారు. అంతటితో ఆగక మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోనన్నారు. సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానన్నారు. రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడని.. అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారని ఆరోపణలు చేశారు. సిద్ధిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని హెచ్చరించారు. హరీష్ రావు తన నియోజక వర్గాన్ని వదిలేసి తమ జిల్లాలో ఎందుకు పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయనపై టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-08-22T13:40:34+05:30 IST