BRS: కారు గుర్తును కేటాయించొద్దు.. ఈసీకి బీఆర్‌ఎస్ ఎంపీల విజ్ఞప్తి

ABN , First Publish Date - 2023-09-27T12:45:27+05:30 IST

కేంద్ర ఎన్నికల సంఘంతో బీఆర్ఎస్ ఎంపీల బృందం బుధవారం ఉదయం భేటీ అయ్యింది.

BRS: కారు గుర్తును కేటాయించొద్దు.. ఈసీకి బీఆర్‌ఎస్ ఎంపీల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో (EC) బీఆర్ఎస్ ఎంపీల (BRS MPs) బృందం బుధవారం ఉదయం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు వేరే వారికి కేటాయించవద్దని ఈసీకి ఎంపీ విజ్ఞప్తి చేశారు. గతంలో ఇలాంటి గుర్తుల వల్ల తమ పార్టీకి రావాల్సిన ఓట్లు కోల్పోయినట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని గతంలో కూడా ఈసి దృష్టికి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇటీవల పలు గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించిన గుర్తుల్లో కారు గుర్తును పోలిన విధంగా ఉన్న వాటి విషయంలో పునః సమీక్ష చేయాలని బీఆర్‌ఎస్ ఎంపీలు కోరారు. బీఆర్‌ఎస్ ఎంపీలు వెంకటేష్‌ నేత, మన్నే శ్రీనివాస్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమ భరత్.. ఈసీని కలిసిన వారిలో ఉన్నారు.

Updated Date - 2023-09-27T12:45:27+05:30 IST