Jagadish Reddy: సూర్యాపేటలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం
ABN , First Publish Date - 2023-11-09T13:56:13+05:30 IST
సూర్యాపేట: మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తన నామినేషన్‌కు సూర్యాపేట నియోజకవర్గం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు.
సూర్యాపేట: మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ (BRS) అభ్యర్థిగా గురువారం నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ.. తన నామినేషన్‌కు సూర్యాపేట నియోజకవర్గం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. సూర్యాపేటలో అభివృద్ధిని కొనసాగించడం కోసం తనను గెలిపించడానికి, మరోసారి కేసీఆర్ (KCR)ను ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇప్పటి వరకు సీట్లు డిక్లేర్ చేసుకోకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి ఏంటో తెలుస్తోందన్నారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ (Telangana)లో ఎక్కడైనా ఒక్క నిమిషం కరెంటు (Current) లేదని చూపడానికి వైర్లు పట్టుకోడానికి తాను సిద్ధమని, రేవంత్ రెడ్డి (Revanth Reddy) సిద్ధమా? అని సవాల్ చేశారు. కర్ణాటక (Karnataka)లో19 గంటలు కరెంటు ఇస్తున్నామంటున్న విషయంలో తాను వైర్లు పట్టుకోవడానికి సిద్ధమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.